పవన్ కల్యాణ్ సెక్యూరిటీ ఆ ఇద్దరి బాధ్యతే

Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. బీజేపీ తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయబోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 30వ తేదీన పిఠాపురానికి వెళ్లనున్నారు. వారాహి వాహనంలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనను చేపట్టనున్నారు.

Janasena appoints Pawan Kalyan s security incharges

దీనితో పాటు- జనసేన పార్టీ అధినేతగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. కూటమి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఎక్కువ భాగం కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

కాగా- పిఠాపురంలో ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తోన్నారు. శాసన సభ్యుడిగా తనను ఎన్నుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులను చేపడతాననేది ప్రకటించారు. తనను గెలిపించుకోవడం పిఠాపురం ప్రజల బాధ్యత అంటూ కొత్త స్లోగన్‌ను తీసుకొచ్చారు పవన్ కల్యాణ్.

తాజాగా- ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనబోతోన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ భద్రత గురించి ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంది జనసేన పార్టీ అగ్రనాయకత్వం. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఆయన సెక్యూరిటీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరిని నియమించింది. అందే నరేన్, మిథిల్ జైన్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ ఇద్దరు పవన్ భద్రతాంశాలను పర్యవేక్షిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+