ఉత్తరాంధ్రలో జనసేన శిబిరం: మెరికల్లాంటి యువత కోసం అన్వేషణ!

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: జనసేన పార్టీని స్థాపించి మూడేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా.. పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత అనంతపురంలో పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో పడ్డ పవన్.. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు మళ్లారు.

అనంతపురంలో నిర్వహించినట్లుగానే ప్రస్తుతం శ్రీకాకుళంలోను జనసేన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ఏ రకమైన సేవలు అందించగలరన్న ప్రాధాన్యతపై అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటర్స్, అనలిస్ట్స్, స్పీకర్స్ కోసం పార్టీ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు 6వేల దరఖాస్తులు అందాయి.

janasena begins recruiments in north andhra

వచ్చిన దరఖాస్తుల్లోంచి సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఉత్తరాంధ్రలో శిబిరం నిర్వహిస్తున్నారు. జనసేన మీడియా వ్యవహారాల సమన్వయ కర్త హరిప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ముందుగా దరఖాస్తు చేసుకోలేకపోయినవారు కూడా.. ఈ ఎంపికలో పాల్గొనవచ్చునని తెలిపారు. అయితే ఈ ఎంపిక విధానం ఎంట్రన్స్ టెస్టు లాంటిది కాదని, కేవలం ప్రతిభను గుర్తించేందుకు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ లో బుధ, గురువారాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్‌లోను, అనంతరం 23, 24, 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ శివారులోని కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్‌లోను ఎంపిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Srikakulam, Janasena conducting tests for candidates who are interested to join in the party. The search for find out content writers and speakers etc
Please Wait while comments are loading...