ముఖ్యమంత్రి జగన్‌కు జనసేన సవాల్? స్వీకరిస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జనసేన పార్టీ సవాల్ విసిరింది. ఇటీవల పుట్టపర్తి జిల్లాలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న కౌలు రైతుల భరోసాయాత్ర గురించి కొన్ని కామెంట్లు చేశారు. వారు అసలు కౌలు రైతులే కాదన్నారు. చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యానించారు.
జగన్ వ్యాఖ్యలకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వారు రైతులే కాదంటూ మాట్లాడి జగన్ కౌలు రైతుల కుటుంబాలను అవమానించారంటూ ధ్వజమెత్తారు. తమతో వస్తే పవన్ పరామర్శిస్తున్నవారందరినీ చూపిస్తామని, వారు కౌలు రైతులో కాదో మీరే చూసుకోవాలంటూ సవాల్ విసిరారు. నిజం తెలియకుండా మాట్లాడి కౌలు రైతుల కుటుంబసభ్యులను క్షోభకు గురిచేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలంటూ మనోహర్ డిమాండ్ చేశారు.

Recommended Video

జనసేనాని పవన్‌కల్యాణ్ కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తున్నారు. జనసేన తరఫున లక్ష రూపాయలను పరిహారంగా ఇస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, చిరంజీవి సోదరి.. ఇలా వారి కుటుంబ సభ్యలుంతా కలిసి రూ.35 లక్షలను జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరారు. చెక్కును కూడా చిరంజీవి సోదరి మనోహర్‌కు అందజేశారు.
కౌలు రైతుల భరోసా యాత్రతోపాటు దానికి సమాంతరంగా పవన్‌కల్యాణ్ అక్టోబరు 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. 175 నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ప్రణాళిక రచించుకున్నారు.












Click it and Unblock the Notifications