భువనేశ్వరికి మాటిచ్చిన పవన్ కల్యాణ్, ఎమోషనల్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి జనసేనాని మద్దతుగా నిలిచారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన పవన్ ప్రస్తుత పరిస్థితుల పైన చర్చలు చేసారు. ఆ తరువాత చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు.ఆ సమయంలోనే తిరిగి మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. రాజకీయంగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. వైసీపీని ఓడిస్తామని శపథం చేసారు.
జైలులో చంద్రబాబుతో:రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు పవన్ వచ్చిన సమయంలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబుతో జైలు ప్రాంగణంలో బాలయ్య, లోకేశ్ తో కలిసి పవన్ కల్యాణ్ కలిసారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. చంద్రబాబును చూసి పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఉద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం, జైలులో భద్రత, వసతులపై పవన్ ఆరా తీసారు. అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు..ప్రభుత్వ తీరు పైన చర్చ జరిగింది. ఆ సమయంలోనే లోకేశ్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఆ వెంటనే బయటకు వచ్చిన పవన్ పొత్తు అంశాన్ని ప్రకటించారు.

భువనేశ్వరికి భరోసా:తరువాత లోకేశ్ బస చేసిన బస వద్దకు పవన్ చేరుకున్నారు. అక్కడ ముందుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అమ్మా..ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే మీ పైన వ్యాఖ్యలు చేయటం బాధాకరమని పేర్కొన్నారు. ఏ మహిళా ఇలాంటి ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమ్మా మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మమేకంతా పని చేస్తామని భువనేశ్వరికి పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు.
చంద్రబాబు బాగానే ఉన్నారని..ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ప్రజలు మన పక్షానే ఉన్నారని, న్యాయమే గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన పవన్ కు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.

లోకేశ్ ను హత్తుకొని:దాదాపు అరగంట సేపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. బాలయ్య, లోకేశ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. కలిసి కట్టుగా వైసీపీ పైన పోరాటం చేద్దామని సూచించారు. త్వరలోనే రెండు పార్టీల నుంచి కమిటీలను వేసి సమావేశం అయ్యేలా నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు.
పవన్ వెళ్లే సమయంలో విమానాశ్రయం వరకు వచ్చేందుకు లోకేశ్ సిద్దం కాగా, పవన్ వారించారు. పవన్ వెంట కారు వరకు వచ్చిన లోకేశ్..ఆయనను హత్తుకుని ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి వేదికగా పవన్ చేసిన రాజకీయ ప్రకటన..ఎన్నికల వేళ ఏపీలో సరి కొత్త రాజకీయ సమీకరణాలను కారణంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications