పవన్ అనూహ్య నిర్ణయం, పార్టీలో వారికి కీలక బాధ్యతలు..!!
జనసేనాని పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం దిశగా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీలో కమిటీల పైన ఫోకస్ చేసారు. తాజాగా రాజమండ్రిలో పవన్ ఇక నుంచి తాను పార్టీ కమిటీల ఏర్పాటు స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అందులో భాగంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసారు. మొత్తం 25 లోక్ సభ.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కమిటీల ద్వారా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ వరుసగా పార్టీ కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజా గా జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని అధినేత చెప్పుకొచ్చారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి ఏటా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ముగ్గురు సాధకులతో కలిపి 7 మంది ప్రధాన సభ్యులు ఉంటారు.

పార్టీ బలోపేతం దిశగా చర్యలు
వీరికి అదనంగా క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ పనిచేసేందుకు మరో 21 మంది సాధకులను ఈ కమిటీలలో భాగస్వాములను చేశారు. కమిటీల కూర్పులో వీరమహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కమిటీల ఎంపికను స్వయంగా సమీక్షించి ఆమోదముద్ర వేశారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కమిటీలు సేకరించి అందించే నివేదికలను, సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత.. పార్టీలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, పార్టీ పదవులు , బాధ్యతల కేటాయింపుపై అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి క్షేత్ర స్థాయిలో సమర్ధ నాయకత్వం వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications