వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఆఫీసులపై దాడుల్ని ఖండించిన పవన్-కేంద్రం జోక్యానికి డిమాండ్

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల దాడుల్ని ఆయన ఖండించారు. దీనిపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కోరారు.

జనసేన ఐటీ వింగ్ సమావేశంలో ఉండగా.. పార్టీ కార్యాలయం నుంచి తనకు ఈ వార్త తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసులపైవి దాడులు జరిగాయని పవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. వ్యక్తిగత దాడులు, పార్టీ ఆఫీసులు, నేతలపై దాడులు జరిగితే అరాచకం, దౌర్జన్యానికి దారి తీస్తుందని పవన్ హెచ్చరించారు. దీనిపై కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ పోలీసు అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని పవన్ హెచ్చరించారు.

janasena chief pawan kalyan condemn ysrcp attacks on tdp offices, demand centres intervention

తనకున్న సమాచారం మేరకు ఈ దాడులకు వైసీపీ శ్రేణులే కారణమనే వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే వైసీపీ నేతలు

భవిష్యత్తులో ఇలాంటి పోకడలు నియంత్రించుకోలేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిసారించాలని పవన్ కోరారు.

Recommended Video

కేంద్రంతో ఏపి సీఎం కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేసిన వీహెచ్ || Oneindia Telugu

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన త్వరలో జట్టు కట్టవచ్చనే వార్తలు వస్తున్న వేళ.. టీడీపీ ఆఫీసులపై దాడుల్ని పవన్ కళ్యాణ్ ఖండించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కేంద్రం జోక్యం కూడా కోరిన పవన్.. బీజేపీ స్పందించకపోతే అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఆసక్తి నెలకొంది.

English summary
janasena chief pawan kalyan on today condemn attacks on tdp offices and seek central govt intervention on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X