మాకు 'మర్యాద' ఇవ్వండి.. మీరు 'మర్యాద' పుచ్చుకోండి!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే నిర్వహించిన రణస్థలంలోని యువశక్తి సభలో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, గౌరవప్రదంగా పొత్తులతో కలిసి పోటీచేస్తామని ప్రకటించారు. పొత్తులో భాగంగా తమకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే గౌరవప్రదమైన స్థానాల్లో పోటీచేస్తామని, అందుకు సంబంధించి సంఖ్య 50కి పైగా ఉండాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జనసేనకు అభ్యర్థుల కొరత?

జనసేనకు అభ్యర్థుల కొరత?


గౌరవం దక్కనిచోట, గౌరవప్రదం లేనిచోట తాముండమని పవన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే 50కిపైగా స్థానాలు కోరుకోవడమంటే తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమని, అన్ని సీట్లిచ్చే అవకాశం లేదని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. జనసేనకు అభ్యర్థుల కొరత ఉందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల లేరని, దీనివల్ల ఆ సీట్లన్నీ వైసీపీ విజయం సాధించడానికి తోడ్పడతాయని తెలుగుదేశం శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

అధికారాన్ని కూడా షేరింగ్ చేసుకుందామని..

అధికారాన్ని కూడా షేరింగ్ చేసుకుందామని..

జనసేనాని ఆలోచనల ప్రకారం.. రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం జనసేన మద్దతిచ్చే అసెంబ్లీ సీట్లమీద ఆధారపడివుండాలని, అలావుంటేనే తమ మాట చెల్లుబాటవుతుందని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా అధికారాన్ని కూడా షేరింగ్ చేసుకునేలా ఉండాలని చూస్తున్నారు. పవన్ కల్యాణ్ కోరుతున్న గౌరవం వెనక చాలా పెద్ద కథ ఉందని జనసైనికులు చెబుతున్నారు.

అధికార పీఠంలో సగం సీట్లు జనసేనవే ఉండాలి

అధికార పీఠంలో సగం సీట్లు జనసేనవే ఉండాలి

మొత్తం 175 సీట్లలో అధికారాన్ని దక్కించుకోవాలంటే 88 సీట్లు రావాలి. అందులో జనసేనకు సంబంధించిన సీట్లు సగమైనా ఉండాలనేది పవన్ యోచనగా ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంవల్ల 53 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవగలిగింది. కాబట్టి ఈ సీట్లు తమకివ్వకపోతే ఒంటరిగా పోటీచేస్తామని, దానివల్ల టీడీపీకే నష్టమని జనసైనికులు వాదనలకు దిగుతున్నారు. 50కి పైగా సీట్ల వల్ల కచ్చితంగా తాము 40కి పైనే నియోజకవర్గాలను దక్కించుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడానికి వీలు కలుగుతుందని, ఏర్పడే ప్రభుత్వానికి జనసేన అవసరపడేలా ఉండాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+