నేడే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం: డిప్యూటీగా పవన్ కళ్యాణ్!: వీరికి కేబినెట్‌లో ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఎన్డీయే కూటమి 164 సీట్ల సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి దృష్టంతా మంత్రివర్గంపైనే పడింది. ఆయనతో పాటు మంత్రులందరూ ప్రమాణం చేస్తారా? లేదా కొంతమందే చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంత్రివర్గంపై చర్చలు జరిపే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు ఏం మాట్లాడుకుని వచ్చారు. జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ చోటు ఉంటుందా? అనే చర్చ సాగుతోంది.

సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండటంతో వారెవ్వరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది. పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇక, జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి ఈసారి అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, కూన రవికుమార్, కొండ్రు మురళీలలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి. మరోవైపు, విజయనరం జిల్లా విషయానికొస్తే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు.. వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్సను ఎన్నికల్లో మట్టికరిపించి మంత్రివర్గ రేసులోకి వచ్చారు.
విజయనగరం జిల్లాలో అదితి గజపతి రాజు, ఎస్టీ కోటాలో సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణిని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. విశాఖ జిల్లా నుంచి గెలిచిన వారిలో మాజీమంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన యాదవ సామాజిక వర్గ నేత పల్లా శ్రీనివాస్, బీజేపీ కోటా కింద విష్ణుకుమార్ రాజు కేబినెట్ రేసులో ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే మంత్రులుగా చేశారు. వీరిలో ఎవరికైనా చోటు దక్కుతుందా? అనేది ఆసక్తిగా మారింది. ఇదే జిల్లా నుంచి ఈసారి జ్యోతుల నెహ్రూ, బీజేపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సీ సామాజికవర్గం నుంచి అయితాబత్తుల ఆనందరావు, జనసేన నేత కందుల దుర్గేష్ లాంటి వారు మంత్రిపదవి కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ పరిధిలో నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణరాజు, పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే కైకలూరు, నూజివీడు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్, పార్థసారధి గతంలో మంత్రులుగా చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేశారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి. శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, బొండా ఉమా లాంటి వారిలో ఎవరికీ అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి.
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు లాంటి వారు మంత్రి పదవికి పోటీ పడుతున్నారు. అయితే లోకేశ్ మంత్రివర్గంలోకి వస్తారనే ప్రచారం సాగుతుండటం, జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్‌ను తీసుకోవాల్సి వస్తే ఇతర సామాజికవర్గాల వైపు అధిష్ఠానం చూపు ఉండవచ్చని తెలుస్తోంది.

ఎస్సీ కోటాలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్, కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణల్లో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందోనని చర్చ సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. బీసీ కోటా పరిశీలిస్తే బీదా రవిచంద్రయాదవ్‌కు ఎమ్మెల్సీ ద్వారా అవకాశం లభిస్తుందేమో చూడాలి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తుండగా మంత్రివర్గంలో ఈసారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన కోటాలో ఆరణి శ్రీనివాస్ పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈసారి పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటా నుంచి గుమ్మనూరు జయరాం, సవితల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు కూడా వినిపిస్తుంది.
వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పేరు మహిళా కోటాలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేరు పరిశీలనలకు రావొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియా, బీసీ జనార్దన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డిల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. ముస్లిం మైనార్టీ కోటాలో ఫరూఖ్‌కు, బీజేపీ కోటా నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే, మరికొద్ది గంటల్లో మంత్రివర్గంపై క్లారిటీ రానుంది.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications