విమర్శలు చేయం - ప్రభుత్వానికి సహకరిస్తాం : పవన్ కళ్యాణ్ ..!!
జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేసారు.
విశాఖ కేంద్రంగా పెట్టుబడి దారుల సదస్సు వేళ జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు వస్తున్న వారికి జనసేన స్వాగతం చెబుతోందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ రెండు రోజులు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకూడదని నిర్ణయించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. రివర్స్ టెండర్లు..మధ్య వర్తుల కమిషన్లు వంటి అడ్డంకులు ఏమీ లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులకు భరసా కల్పించాలని సూచించారు. సుముద్ర తీరం..ఖనిజ సంపద...మానవ వనరులు ఉన్న అంశాలు తెలియచెప్పాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.

రాజకీయం కంటే రాష్ట్రమే ముఖ్యం
ఆంధ్రప్రదేశ్ యువత పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని బావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. విశాఖలో జరగుతున్న ఈ సదస్సు ద్వారా కేవటం విశాఖకే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వానికి విన్నివించారు. అమరావతి, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, కడప వంటి ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను కూడా వారికి తెలియచేయాలని సూచించారు. రాష్ట్రం మొత్తానికి ఇది నిజమైన పెట్టుబడి దారుల సదస్సుగా ఉండేలా చూడాలన్నారు. రాజకీయాల కన్నా..రాష్ట్ర శ్రేయస్సే జనసేన ముఖ్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు.

రాజకీయ విమర్శకు దూరంగా
విశాఖ పెట్టుబడి దారుల సదస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. విదేశీ ప్రతినిధులతో సహా పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు చేస్తోంది. పరిశ్రమలను ఆహ్వానిస్తున్న వేళ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోందనే అభిప్రాయం ఉంది. మాజీ మంత్రి గంటా విశాఖ కేంద్రంగా ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. విశాఖ కేంద్రంగా పెట్టుబడి దారుల సదస్సుకు చేస్తున్న హడావుడికి కారణం ఏంటని ప్రశ్నించారు. దీనిని ప్రభుత్వంలోని మంత్రులు తప్పు బడుతున్నారు. ఈ సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము రాజకీయ విమర్శలకు ఈ రెండు రోజులు దూరంగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభుత్వానికి సహకరిస్తామని చెబుతూనే.. తాను చేయదలిచిన సూచనలను స్పష్టం చేసారు.

పవన్ కల్యాణ్ పరిణితి
రాష్ట్రానికి సంబంధించిన కీలక సదస్సు జరుగుతున్న వేళ పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జాతీయ- అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రంలో సదస్సుకు వస్తున్న వేళ రాజకీయాలకంటే..రాష్ట్రం ముఖ్యమని చెప్పటం.. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటామని చెప్పటాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ కంటే పవన్ భిన్నంగా ఆలోచన చేసారని..ఆయన పరిణితితో కూడిన ప్రకటన చేసారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా టీడీపీ మార్గంలోనే తాను ప్రయాణం చేయటం లేదని..తన విధానానికి స్పష్టత ఉందని చెప్పే ప్రయత్నం చేసారు. అటు టీడీపీ ఈ కీలక సదస్సు వేళ ప్రభుత్వం పైన రాజకీయంగా విమర్శలు కొనసాగిస్తోంది. పవన్ తన సూచనలు ప్రభుత్వానికి తెలియచేస్తూనే..రాష్ట్రం ముఖ్యమని చెప్పటాన్ని స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications