ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ థాంక్స్: పీవీకే నాయుడు మార్కెట్ లాగే ఇతర మార్కెట్లు కూడా...
గుంటూరులో గల పీవీకే నాయుడు మార్కెట్‌ను వేలం జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మినహాయించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. తమ పార్టీ చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చి.. నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. పీవీకే నాయుడు మార్కెట్ అంటే గుంటూరు అనుబంధాన్ని పేనవేసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పీవీకే నాయుడు మార్కెట్ వేలం వేస్తారని తెలిసి ప్రజలు ఆందోళన చెందారని పవన్ కల్యాణ్ తెలిపారు. వారి ఆకాంక్ష మేరకు జనసేన పార్టీ పోరాడిందని గుర్తుచేశారు. 10 రోజులు నిరసన దీక్ష చేయడంతో ప్రభుత్వలో కదలిక వచ్చిదని చెప్పారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆదాయం కోసం ఆస్తులను అమ్మడం సరికాదు అని.. పెట్టుబడుల కోసం మార్గాలను అన్వేషించాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.

వైఎస్ జగన్ సర్కార్ మిషన్ ఏపీ బిల్డ్ పేరుతో విలువైన ఆస్తులను విక్రయించాలని భావించడం సరికాదన్నారు. పాలనాపరంగా సరైన ప్రణాళిక లేకపోవడంతో సమస్య వచ్చిందన్నారు. పీవీకే నాయుడు మార్కెట్ మాదిరిగా ఇతర మార్కెట్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ప్రజలు హర్షిస్తారు అని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications