బద్వేల్ బై పోల్: జనసేన పోటీపై హాట్ డిబేట్ ; పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీపై చర్చ

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు ఉప ఎన్నికల బరిలో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బరిలోకి దిగుతుందని రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.

బద్వేలు బరిలో జనసేన .. ఏపీలో ఆసక్తికర చర్చ

బద్వేలు బరిలో జనసేన .. ఏపీలో ఆసక్తికర చర్చ

ఇప్పటికే అధికార వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరు తమ అభ్యర్థిగా ఖరారు చేయగా, మరోవైపు పరిషత్ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గ పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి, ఈసారి వైసీపీకి గట్టిపోటీ ఇస్తామన్న ధీమాతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలుగుదేశం పార్టీ నుండి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ని బద్వేల్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సమయంలో బిజెపికి ఆ సీటును కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీకి బద్వేలు నుంచి ఉప ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని ఇస్తారని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు.

రేపు కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ .. పోటీపై నిర్ణయం

రేపు కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ .. పోటీపై నిర్ణయం

ఇదే సమయంలో పొత్తులో భాగంగా పోటీ చేయడానికి దూరంగా ఉంటే పార్టీ నష్టపోతుందని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు ఉపఎన్నిక బరిలో జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం రోజు పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కడప జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత, వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం బిజెపి జనసేన ల మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో జనసేన ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

 ఎన్నికల్లో పోటీపై బీజేపీ జనసేన సమన్వయ కమిటీలో చర్చ

ఎన్నికల్లో పోటీపై బీజేపీ జనసేన సమన్వయ కమిటీలో చర్చ


ఏది ఏమైనా రేపు పార్టీ నాయకులతో భేటీ తరువాత బద్వేలు నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రానుంది. ఇక మరోవైపు బద్వేల్ ఉప ఎన్నిక పోటీ అంశంపై బిజెపి జనసేన పార్టీకి చెందిన నేతలు సమన్వయ కమిటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. కనీసం పోటీ కూడా చెయ్యని కారణంగా పార్టీ గుర్తు కోల్పోయింది అని చర్చ జరుగుతున్న సమయంలో జనసేన ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. మరోపక్క వైసీపీ పాలనపై పోరాటం చెయ్యాలని రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ బద్వేలులో పోటీ చేస్తేనే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

    YS Sharmila Condolence Saidabad Incident Victim Family || Oneindia Telugu
     బద్వేలు ఎన్నికల షెడ్యూల్ ఇలా

    బద్వేలు ఎన్నికల షెడ్యూల్ ఇలా

    కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13వ తేదీ గా నిర్ణయించారు .ఇక అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుండగా నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇదే సమయంలో ఉప ఎన్నిక జరగనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+