జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు - ఫైనల్ లిస్టులో..!!
ఏపీలో త్రిముఖ పోరు ఖాయమైంది. పొత్తులపై స్పష్టత వచ్చింది. సీట్ల లెక్కల పై కసరత్తు జరుగుతోంది. పొత్తులో బాగంగా జనసేన - బీజేపీకి 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఖరారరయ్యాయి. అయితే, బీజేపీ ఎంట్రీ తో ఇప్పటికే టీడీపీ - జనసేన పోటీ చేసే స్థానాలుగా ప్రచారంలోకి వచ్చిన నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనసేన కు కేటాయించిన 24 స్థానాల పైన తుది నిర్ణయం జరిగింది. దీని పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
సీట్ల పై స్పష్టత : జనసేనకు పొత్తులో కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో ఒకటి తగ్గనుంది. జనసేన కు తొలుత అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం స్థానాలు కేటాయించారు. తాజా సమీకరణాలతో అనకాపల్లి నుంచి బీజేపీ పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఫలితంగా జనసేన రెండు సీట్లలోనే పోటీ చేయనుంది. అయితే, మచిలీపట్నం ఎంపీ స్థానం జనసేనకు ఇవ్వాలని భావించినా...బీజేపీ నుంచి వస్తున్న తాజా ప్రతిపాదనలతో మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్పు తప్పనిసరైతే నర్సాపురం జనసేన తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే పవన్ తనకు కేటాయించిన సీట్లలో ఒకటి వదులుకొనేందుకు సిద్దం కావటంతో..ఈ రెండు స్థానాల్లో మార్పులకు ఛాన్స్ ఉండదని జనసేన నేతలు చెబుతున్నారు.

జనసేన సీట్లు : ఇక, అసెంబ్లీ స్థానాల్లో జనసేన 24 చోట్ల పోటీ చేయనుంది. ఇప్పటికే అయిదు స్థానాల్లో పవన్ తన అభ్యర్దులను ఖరారు చేసారు. తెనాలి, కాకినాడ రూరల్, నెల్లిమర్ల, అనకాపల్లి, రాజానగరం స్థానాలకు అభ్యర్దుల ను ప్రకటించారు. ఇప్పుడు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక, ప్రకటించిన అయిదు స్థానాలు మినహాయిస్తే మిగిలిన 19 నియోజకవర్గాలు ఖరారయ్యాయి. వాటిలో..విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, దర్శి, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, రామచంద్రపురం, పిఠాపురం, రాజోలు, రాజానగరం, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, పోలవరం, ఉంగటూరు,నిడదవోలు ఉన్నాయి. నిడుదవోలు నుంచి కందుల దుర్గేష్ పేరు ఖరారైంది.

తుది కసరత్తు : అదే విధంగా పాలకొండ, విశాఖ సౌత్, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో బీజేపీ నుంచి తాడేపల్లి గూడెం సీటు పైన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. పవన కల్యాణ్ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో కాకినాడ ఎంపీగానూ బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. కాకినాడ నుంచి పోటీ చేస్తే పవన్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఎంపీగా పోటీ చేయకపోతే..పవన్ తిరుపతి నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. ఇక, బీజేపీతో సీట్ల చర్చలు పూర్తయిన తరువాత జనసేన ఈ సీట్లకు అభ్యర్దులను అధికారికంగా ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications