పవన్ అభిమానులూ సత్తా చాటండి: జనసేన పిలుపు
హైదరాబాద్: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులకు 'జనసేన' ఓ పిలుపు నిచ్చింది.
Recommended Video

పవన్ కళ్యాణ్‌లాగే కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్న జనసేన కార్యకర్తలు

నిజమైన జనసైనికులు సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ వారికి టార్గెట్ విధించింది. సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద చేసిన సంబరాల మాదిరిగానే ఇప్పుడు గ్రామ గ్రామానా సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని పిలుపునిచ్చింది.
సినిమా థియేటర్లను అలంకరించేబదులుగా ఆయా గ్రామాలు, నగరాల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని అభిమానులను కోరింది. సెప్టెంబర్ 9 లోపు ఒక్కొక్కరు వంద సభ్యత్వాలు చేర్పించడంతో పాటు పది మంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేసి పవన్ అభిమానుల సత్తా ఏంటో చాటాలని సూచించింది.












Click it and Unblock the Notifications