ముద్రగడతో పవన్ భేటీ, పార్టీలోకి ఆహ్వానం- వైసీపీ వ్యూహాలకు చెక్..!?

ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ఈ సమయంలో గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ముద్రగడ వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే జనసేన నేతలు ముద్రగడను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సమయంలో ముద్రగడ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇటు టీడీపీ నేతలు ముద్రగడను కలిసేందుకు సిద్దమయ్యారు.

Recommended Video

    Pawan Kalyan Mudragada Meet వేడెక్కిన ఉత్తరాంధ్ర రాజకీయం |Andhra Pradesh | Telugu Oneindia

    ముద్రగడతో జనసేన మంతనాలు: గోదావరి జిల్లాల్లో ఎవరికి పట్టు చిక్కితే వారికి అధికారం దక్కినట్లే. టీడీపీ, జనసేన పొత్తుతో ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు వ్యూహం. ఈ సమయంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడతో వైసీపీ నేతలు వరుస మంతనాలు జరిపారు. ముదగ్రడ తన కుమారుడుతో సహా వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం సాగింది. దీని పైన అధికారికంగా మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

    Janasena invites Mudragada Padmanabham to join in the party, Pawan likely to meet him soon

    ఈ సమయంలోనే అనూహ్యంగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ముద్రగడతో సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. కాపుల సమస్యల పైన తాజాగా పవన్ రాసిన లేఖ గురించి ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ, జనసేన కూటమిలోకి రావటం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించారు. ఆ సమయంలో ముద్రగడ తన వైఖరి స్పష్టం చేసారు.

    ముద్రగడను కలవనున్న పవన్: పవన్ రాసిన లేఖలో అంశాల పైన ముద్రగడ సానుకూలంగా స్పందించారు. పార్టీలో చేరిక పైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ తన ఇంటికి వస్తే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ నాయకులతో కలిసి ముద్రగడను కలవనున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో చేరాలని కోరనున్నారు.

    ముద్రగడ వైసీపీలో చేరితే కాపు ఓటింగ్ లో చీలక వస్తుందని..అది వైసీపీకి మేలు చేస్తుందని టీడీపీ-జనసేన నేతల ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. దీంతో, ముద్రగడతో చర్చలు చేసి కూటమిలో చేరాలని ఆహ్వానించేలా కార్యాచరణ సిద్దం చేసారు. అవసరం అయితే పవన్ స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లేందుకు..మంతనాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీ నేతల సమాచారం.

    జనసేనలో ముద్రగడ చేరేనా: సంక్రాంతి పండుగ రోజుల్లోనే పవన్ నేరుగా ముద్రగడతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో టీడీపీ ప్రభుత్వం తనతో వ్యవహరించిన తీరు ైన పలు సందర్భాల్లో ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు టీడీపీతో కలిసిన జనసేన నుంచి ఆహ్వానం వస్తున్న సమయంలో ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

    పవన్ వస్తే పరిశీలిస్తానని ముద్రగడ చెప్పినట్లుగా జనసేన నేతల సమాచారం. ఇప్పుడు పవన్ నేరుగా ముద్రగడ వద్దకు వెళ్లి ఆహ్వానిస్తే..ముద్రగడ పార్టీలో చేరేందుకు అంగీకరిస్తారా లేదా అనేది గోదావరి రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. ఇదే సమయంలో వైసీపీ అలర్ట్ అవుతోంది. దీంతో. సంక్రాంతి సమయంలో ముద్రగడ రాజకీయ నిర్ణయంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+