Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ, బీజేపీతో పొత్తు పై మనోహర్ కీలక వ్యాఖ్యలు..!!

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పొత్తులపై కొత్ చర్చ మొదలైంది. పవన్ తనను సీఎం చేయాలంటూ..జనసేనకు అధికారం ఇవ్వలంటూ ప్రచారం చేసారు. ఎక్కడా పొత్తుల ప్రస్తావన చేయలేదు. దీంతో టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఆలోచన మారిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పొత్తుల పైన తమ వైఖరి స్పష్టం చేసారు. పవన్ రెండో విడత వారాహి యాత్ర పైన క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఊహించిన దానికన్నా విజయవంతం అయ్యిందని మనోహర్ పేర్కొన్నారు. అద్భుతమైన యాత్రగా వివరించారు. జనసెన తో కలిసి నడవాలనీ ప్రజల్లో స్పష్టంగా కనపడుతుందని చెప్పుకొచ్చారు. యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సమాచారం సేకరించారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏమి చేసేది స్పష్టంగా ప్రజలకు వివరించారన్నారు. పెన్షన్,రోడ్లు పై ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయని వెల్లడించారు. సంస్కారం లేని మనుషులు పాలన చేస్తే ఇలానే ఉంటుందని వయాఖ్యానించారు. మీలోనే స్పందన లేనప్పుడు స్పందన కార్యక్రమాలు ఎందుని ప్రశ్నించారు. 99 శాతం హామీలు పూర్తి చేశాము అనప్పుడు స్పందన కార్యక్రమాలు ఎందుకని మనోహర్ నిలదీసారు.

Janasena Leader Manohar interesting comments on Alliance with TDP and BJP

ప్రశ్నిస్తున్న నాయకుల పై వందల సంఖ్యలో కేసులు పెడుతూ వేధిస్తున్నారని మనోహర్ ఆరోపించారు. వైసిపి నాయకులు రైతుల దగ్గర కూడా లంచాల తీసుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో జగనన్న కి చెబుతాము,జగనన్న భరోసా,కార్యక్రమంలో ద్వారా చెయ్యలేని పనులు ఇప్పుడు సురక్ష అని పెట్టీ పేద ప్రజలను ఏమి ఉద్దరిస్తారని ఎద్దేవా చేసారు. రాష్ట్ర సమస్యల పై పవన్ కళ్యాణ్ మాట్లాడితే వ్యక్తిగతంగా దూషణలు‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగనన్న సురక్ష క్రింద 9లక్షల 48వేల మందికి టోకెన్లు ఇచ్చారు వాటి ద్వారా ఏమి చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిషత్తు పవన్ కళ్యాణ్ ద్వారానే జరుగుతుందని మనోహర్ పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవశ్యకత ఉందని మనోహర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ద్వారా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తారని ప్రకటించారు.రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ నుంచి కొనసాగిస్తామని వెల్లడించారు. రెండో విడత యాత్ర షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుడదని ప్రజల్లో సంకల్పం మొదలైందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని పరోక్షంగా టీడీపీ, బీజేపీతో పొత్తు అంశం పైన మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+