జిల్లాల్లో అల్లర్లు, గొడవలు, హింస: సరైన వ్యక్తికి హోం శాఖ
Nagababu: జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు.. హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూరకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అనితతో నాగబాబు సమావేశం కావడం ఇదే తొలిసారి. అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖకు మంత్రిగా అపాయింట్ అయినందున అభినందించారు.
ఈ శాఖకు సరైన వ్యక్తికి కేటాయించారని నాగబాబు కితాబిచ్చారు. ఓ మంచి వ్యక్తికి ఆ శాఖ రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల పై జరిగే అవాంఛనీయ సంఘటనలు అరికట్టాలని, నేరాల శాతాన్ని తగ్గించాలని కోరారు. తాను అదే పనిలో ఉన్నానని అనిత వెల్లడించినట్లు నాగబాబు తెలిపారు.

ఇటీవలే పరోక్షంగా వైఎస్ఆర్సీపీపై ఘాటు ఆరోపణలను గుప్పించారు నాగబాబు. తమ కూటమి ప్రభుత్వ పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు, హింసాత్మక సంఘటనలను సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నుతోందంటూ ఆయన ఆరోపించారు.
ఇందులో భాగంగా ప్రతి జిల్లాకిు 10 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారని విమర్శించారు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో జిల్లాకు 10 కోట్ల రూపాయల చొప్పున 13 ఉమ్మడి జిల్లాలకు 130 కోట్లను గుమ్మరించనున్నట్లు నాగబాబు ధ్వజమెత్తారు. అలా సంవత్సరానికి 1,500 కోట్లను వైసీపీ ఖర్చు పెట్టనుందని అన్నారు.
ఇలా అల్లర్లు చేయడం ద్వారా మధ్యంతర పరిపాలన వచ్చేస్తుందని అనుకునే పనికి మాలిన ఆలోచనలు వైసీపీ చేస్తోందని మండిపడ్డారు. వీటిని ధీటుగా ఎదుర్కుంటామని అన్నారు. ఈ కుట్రలను ఎలా అరికట్టాలో కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసునంటూ నాగబాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications