పవన్ గారు.. అంతా మీ చేతుల్లోనే ఉంది, పునాలోచించుకోండి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట తెర మీదికి వచ్చారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయాలు, పవిత్రమైన భ్రమరాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం పాలకమండలి ఛైర్మన్ పదవి అంశాలను ప్రస్తావించారు. తన అభ్యంతరాలను తెలియజేశారు. తన నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
కారు డ్రైవర్ హత్య కేసులో వినుత కోటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ కండీషన్లకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడే ఉంటోన్నారు. అయినప్పటికీ- నియోజకవర్గం రాజకీయాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తోన్నారనేది తాజాగా లేఖతో ప్రస్ఫూటమైంది.

శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్ కు ఇవ్వడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పూణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజనం కాదని అన్నారు. తనపైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకడని వినుత కోట తేల్చి చెప్పారు.
దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్ టీమ్ కు, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ కు వివరించానని, ఆధారాలు సైతం ఇచ్చానని పేర్కొన్నారు. తనకు జరిగిన సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నానని వినుత కోట చెప్పారు.
ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక మంది జనసేన కార్యకర్తలు నిజంగా, నిజాయితీగా పని చేసిన వాళ్ళు చాలా మాంది ఆలయ చైర్మన్ పదవికి అర్హులు ఉన్నారని వినుత కోట చెప్పారు. పార్టీ కొసం గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా పొరాడిన వాళ్ళు, పోలీసుల దగ్గర బూటు కాళ్ళతో తన్నించుకున్న వాళ్ళు పొరాటాలు చేసి కేసులు పెట్టించుకొన్ని జైలు కెళ్లిన వాళ్ళు, వీర మహిళలు ఉన్నారని గుర్తుచేశారు.
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
— Vinutha Kotaa (@VinuthaKotaa) September 19, 2025
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ఎంపిక పై పునరాలోచించాలని, మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కి, మహిళలపై కుట్రలు చేసే వ్యక్తి అయిన కొట్టే సాయి ప్రసాద్ కి ఇవ్వడాన్ని అభ్యంతరం తెలుపుతున్నాను.@PawanKalyan | @ncbn |… pic.twitter.com/8CikS1v6mo
ఇలా నిజాయితీగా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి ఎంపిక చెయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి, జవసేన నియోజకవర్గ ఇన్ ఛార్జీ ఉన్న తనను భౌతికంగా హతం చెయ్యాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే కుట్రలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన కొట్టే సాయి ప్రసాద్ కు.. పవిత్ర పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications