టీడీపీతో పొత్తు వేళ జనసేనకు భారీ షాక్ - ఏం జరుగుతోంది..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖయమైంది. బీజేపీ కలవటం పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయం లోనే కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు భారీ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో..ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జనసేన గుర్తు గల్లంతు అయింది. ఇది పొత్తులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎన్నికల సంఘం నిర్ణయం:
ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందది. ఏపీలో గుర్తింపు పొందిన వాటిలో వైసీపీ, తెలుగుదేశం ఉన్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటుగా తెలుగు దేశం, వైఎస్సార్సీపీ రాష్ట్ర హోదా పొందినట్లు పేర్కొంది. ఇదే సమయంలో కేంద్రం ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్ ను విడుదల చేసింది. అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ ఉంది. గతంలో దీనిని జనసేనకు కేటాయించినా..ఇప్పుడు ఫ్రీ సింబల్ గా వెల్లడించింది.

Janasena lost common Symbol for next Election, As per CEC Notifiction

జనసేన గుర్తు గల్లంతు:
ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తో జనసేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలోనే కామన్ సింబల్ పైన జనసేన- ఎన్నికల సంఘం మధ్య సంప్రదింపులు జరిగాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేన పోటీ చేసిన స్థానాలు..ఓట్లు..సీట్ల ఆధారంగా కామన్ సింబల్ దక్కలేదని చెబుతున్నారు. తమకు గాజు గ్లాస్ గుర్తు కొనసాగించాలని జనసేన ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, జనసేన చేసిన అభ్యర్ధనను తిరస్కరిస్తూ ..మరలా 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపుకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గుర్తు చేసింది.

పోటీపైనా ప్రభావం:
ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు కామన్ సింబల్ లేకపోవటంతో ఎక్కడికక్కడ నియోజకవర్గంలో కేటాయించే గుర్తు తో పోటీ చేయాల్సి ఉంటుంది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా పేర్కొనటంతో స్వతంత్ర అభ్యర్దులకు ఈ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే జనసేన అభ్యర్దులు పోటీలో ఉన్న చోట ఇది ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. పొత్తుల సమయంలో కామన్ సింబల్ లేకపోవటం కూడా రెండు పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో..ఇప్పుడు జనసేన తమ కామన్ సింబల్ పైన ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+