అల్లు అర్జున్ తో శత్రుత్వంపై జనసేన ఎమ్మెల్యే క్లారిటీ-మాట్లాడితే మాత్రం కౌంటరే..!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూ, మెగా కుటుంబానికీ కొనసాగుతున్న వైరంలో ఈ మధ్య జనసేన ఎమ్మెల్యే ఒకరు చేరిపోయారు. అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారడంతో మెగా కుటుంబం సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని కూడా చెప్పేశారు.

janasena mla bolisetty Srinivas clarified to remarks against allu arjun

జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయనకూ ఫ్యాన్స్ ఉన్నారా అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమేనని, షామియానా కంపెనీలా బ్రాంచ్ లు పెట్టుకున్నారేమో తనకు తెలియదన్నారు. అల్లుఅర్జున్ తనకూ ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకున్నారేమో అని బొలిశెట్టి తెలిపారు. అల్లు అర్జున్ ను తమ కార్యక్రమాలకు రమ్మని పిలవలేదన్నారు. దీంతో బొలిశెట్టి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను దేని గురించీ మాట్లాడదలచుకోలేదంటూనే తన వ్యాఖ్యలకు కారణం చెప్పారు. అల్లు అర్జున్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చానన్నారు. అంతటితో అది ముగిసిపోయిందన్నారు. తనకు కానీ, తన పార్టీ జనసేనకు గానీ అల్లు అర్జున్ అంటే శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. కాబట్టి అల్లు అర్జున్ ఏదైనా మాట్లాడితే తాను స్పందిస్తాను కానీ ఊరికే మాట్లాడబోనని తేల్చిచెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+