జన సైనికులకు గుడ్‌న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ఆ పార్టీ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కావడంతో సభ్యత్వాల నమోదు భారీస్థాయిలో ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ప్రమాద జీవిత బీమాతోపాటు రూ.50వేల ప్రమాద బీమా కల్పిస్తున్నారు. 18వ తేదీన ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు 28వ తేదీ వరకు 11 రోజులపాటు జరగనుంది.
ప్రతి జనసేన నేత, నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ బాధ్యతగా పాల్గొనాలని, గతంలో తీసుకున్నవారి సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోవాలని, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేయాలంటూ జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మనకోసం అండగా నిలబడేవారికి అండగా నిలబడే కార్యక్రమమని వెల్లడించింది. పార్టీ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ ఐకమత్యంగా ఉండి వందకు వంద శాతం ఫలితాలను ఎన్నికల్లో సాధించగలిగామని, జాతీయస్థాయిలో అందరూ దీనిపైనే చర్చించారని మనోహర్ అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లకు సభ్యత్వ నమోదుకు సంబంధించి లాగిన్ ఐడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 నియోజకవర్గాలకు పోటీచేసి మొత్తం 21 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. పిఠాపురం నుంచి పోటీచేసిన జనసేనాని పవన్ కల్యాణ్ 70వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పౌసరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేష్ పర్యాటలక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications