జన'సైన్యం' కోసం అంతా సిద్ధం: 25 ఏళ్లు ఆగేందుకు సిద్ధం... ఇదీ పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu
Janasena Party Membership Drive Very Soon జన'సైన్యం' కోసం అంతా సిద్ధం | Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

చిరంజీవితో విజయసాయి చర్చలు?: జగన్-చంద్రబాబులకు షాకిస్తారా?

ఆన్‌లైన్‍‌లో సభ్యత్వ నమోదు

ఆన్‌లైన్‍‌లో సభ్యత్వ నమోదు

పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన సాఫ్టువేర్ సాంకేతిక వివరాలను జనసేన ఐటీ విభాగం నిపుణులు పవన్ కళ్యాణ్‌కు వివరించారని తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించి సాఫ్టువేర్, యాప్స్‌లను పరిశీలించిన పవన్ కొన్ని మార్పులను ఐటీ నిపుణులకు సూచించారు.

పవన్ కళ్యాణ్ సంతృప్తి

పవన్ కళ్యాణ్ సంతృప్తి

జనసేన ఐటీ విభాగం రూపకల్పన చేసిన సభ్యత్వ నమోదు సాప్టువేర్, యాప్స్ పైన పవన్ కళ్యాణ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ ప్రకటనలో జనసేన తెలిపింది.

కొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు

కొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు

ఈ సాఫ్టువేర్‌ను పలుమార్లు పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్‌కు చూపించినట్లు ఐటీ విభాగం నిపుణులు వెల్లడించారు. ట్రయల్ రన్ సంతృప్తికరంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్‌కు వివరించారని తెలిపారు. కొద్ది రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులకు తెలిపారు.

ఇదీ పవన్ కళ్యాణ్ అని..

కాగా, మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభమవుతుందని తెలియగానే చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇంతకుముందు పార్టీ పెట్టిన వారు గెలవడమే ధ్యేయంగా గెలిచారని, కానీ పవన్ సిద్ధాంతాన్ని గెలిపించేందుకు 25 సంవత్సరాలు ఆగేందుకు సిద్ధమని చెబుతున్నారని ఓ నెటిజన్ కితాబిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
JanaSena Party Membership Drive Very soon.
Please Wait while comments are loading...