కాపులకు ఆహ్వానం... 4న 'ముద్రగడ' నామకరణ మహోత్సవం?
ఏపీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు అర్థరాత్రి వరకు ఓపికగా వేచిచూసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేశారు. పవన్ ను కచ్చితంగా ఓడిస్తానంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళను తాను పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ బీరాలు పలికారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
పిఠాపురంలో సాయంత్రం 5.00 గంటల వరకు 71.3 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి సమయంలో కూడా క్యూ లైన్‌లలో జనాలు బారులు తీరారు. వారంతా ఓటేసేవరకు పోలింగ్ కొనసాగింది. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. పవన్ విజయం సాధించడం ఖాయమనే ధీమాలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు జనసైనికులు ముద్రగడ పద్మనాభాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.

ఉప్మా, కాఫీలు తెచ్చుకోవాలి
'ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక' అంటూ సెటైర్లు వేస్తున్నారు. అందరికీ నమస్కారం.. ముద్రగడ నామకరణ మహోత్సవానికి రావాలని కాపు సోదర సోదరీమణులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కార్యక్రమం జరుగుతుందని, పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారని, ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుందన్నారు. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు వేశారు.
ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక pic.twitter.com/EtGwItG64Y
— Political Missile (@TeluguChegu) May 13, 2024












Click it and Unblock the Notifications