మంత్రులు రోజా - జోగి రమేష్ కార్ల పై జనసైనికుల దాడి..!!

విశాఖలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విశాఖ గర్జన ముగించుకొని మంత్రులు తిరిగి విమానాశ్రయం చేరుకున్న సమయంలోనే జనసేనాని విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద పవన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు..జనసైనికులు చేరుకున్నారు. ఆ సమయంలోనే మంత్రులు విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో మంత్రులు రోజా, జోగి రమేష్.. టీటీడీ ఛైర్మన్ అక్కడకు చేరుకున్నారు. వారి కార్ల పైన జనసేన సైనికులు దాడి చేసారు.

కర్రలు - రాళ్లతో దాడి చేసారు. జోగి రమేష్ వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయి. కార్లు ధ్వంసాలు అయ్యాయి. తమ పైన దాడికి తమ సిబ్బందికి గాయాలు అయినట్లుగా మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. మంత్రి జోగి రమేష్..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఒకే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ కారు పైన దాడికి దిగారు. తన పైడి దాడికి ప్రయత్నించినట్లు జోగి రమేష్ వెల్లడించారు. దీంతో..మంత్రి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో వారికి గాయాలు అయినట్లుగా మంత్రి వివరించారు విమానాశ్రయం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు.

Janasena party workers attack ministers Roja and Jogi Ramesh amid the Visakha Garjana

గర్జనకు ధీటుగా పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో..ముందుగానే పోలీసులు మోహరించారు. అదే సమయంలో మంత్రులు విమానాశ్రయానికి వస్తున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ కోసం వచ్చిన అభిమానులు తమను కవ్వించే విధంగా కారు పైన కర్రలతో దాడులు చేయటం...అడ్డుకొనేందుకు ప్రయత్నించిన సిబ్బంది పైన దాడులు చేయటాన్ని మంత్రులు ఖండించారు. దీని పైన పవన్ కు హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ అందరినీ వెనక్కు పంపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+