విషాదంలో జనసేన ముఖ్య నేత.. పరామర్శకు పవన్
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గురు చరణ పద్మం తిరుపతిలోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మంగళం రోడ్డులోని గోవిందధామంలో శనివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
తిరుపతి: జనసేన పార్టీ ముఖ్యనేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బోత్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ విషాదంలో మునిగిపోయారు. ఆయన మాతృమూర్తి గురు చరణ పద్మం శుక్రవారం కన్నుమూశారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మంగళం రోడ్డులోని గోవిందధామంలో శనివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

గురుచరణ పద్మం మృతి చెందారని సమాచారం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, అధికార, అనధికార వర్గాలు ఆమె మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. హరిప్రసాద్‌ను పరామర్శించారు.
డాక్టర్ హరిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ శనివారం తిరుపతికి వస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications