అభ్యర్దుల్లో కీలక మార్పులు - టీడీపీ నేతకు జనసేన టిక్కెట్..!!
జనసేన తిరుపతి అభ్యర్థి మార్పు తప్పేలా లేదు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను పార్టీ అబ్యర్దిగా కరారు చేసారు. దీని పైన తిరుపతి టీడీపీ, జనసేన నేతలు విముఖంగా ఉన్నారు. దీంతో, అభ్యర్థి మార్పు పైన జనసేన, టీడీపీ అదిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి జనసేన ముఖ్య నేతలతో పాటుగా టీడీపీ నేత, తాజాగా జనసేనలో చేరిన మరో నేత వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో,సీట్ల విషయంలో కొన్ని మార్పులు చేసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.
అభ్యర్దుల మార్పు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని సీట్లలో కూటమి అభ్యర్థుల మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. జనసేన నేగ మెగా బ్రదర్ నాగబాబుతో జనసేన నేతలు సమావేశం కానున్నారు. తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి, చిత్తూరు గాని, మదనపల్లి గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాని పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి స్థానిక నేతలు డాక్టర్ హారిప్రసాద్ , కిరణ్‌రాయల్‌లు జనసేన సీటు కోసం ప్రయత్నించారు. మరో వైపు టీడీపీ నుంచి ఉకా విజయ్ కూమార్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు సైతం జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే జనసేనాని ఎవరూ ఉహించని ట్విస్ట్ ఇచ్చారు.

తిరుపతి దక్కేదెవరికి : అరణి శ్రీనివాసులుకు తిరుపతి సీటు ఇచ్చారు. దీని పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో ఆరణికి టికెట్ ఖరారు చేయడం వివాదానికి దారి తీసింది. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌పై టీడీపీ నేత సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని.. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట బయటపెట్టేశారు. ఇదే సమయంలో రాజంపేట పార్లమెంటు సెంగ్మెంట్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా చేసిన గంటా నరహారి జనసేనలో చేరారు. ఆయన వెనుక తానా మాజీచైర్మన్ వేమన సతీష్ ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో గంటా ఆశతో కనిపిస్తున్నారు.

రెండు సీట్లలో మార్పులకు ఛాన్స్ : ప్రస్తుతం హైదరాబాద్ చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచార సభలు, బీజేపీ నుంచి వస్తున్న సీట్ల మార్పు ప్రతిపాదనలతో పాటుగా చిత్తూరు జిల్లాలో సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. సీట్ల మార్పు అవసరమైతే తిరుపతి నుంచి టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేనలో చేరిన నరహరికి సీటు ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో రాయలసీమలో కూటమి విజయవకాశాలు..వైసీపీ బలం పైన ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఇక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోటీ చేసే స్థానాలు..అభ్యర్దుల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications