రైలు ప్రయాణికులందరికీ గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు తీపికబురు. తరుచుగా రైలు ప్రయాణం చేసేవారందరూ రైలులో సరైన ఆహారం దొరక్క, దొరికినా అధిక ధరలవల్ల కొనుగోలు చేయలేకపోతుంటారు. ఆ ఇబ్బందులను అధిగమించేలా భారతీయ రైల్వే అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తెస్తోంది. జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలంటూ రైల్వే బోర్డు ఇప్పటికే అన్ని జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది.

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం విభాగం డైరెక్టర్ సుమీత్ సింగ్ అన్ని కార్యాలయాలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇకనుంచి జనతాఖానా కింద రూ.20కే ఫుడ్ దొరకనుంది. ఒక ప్యాకెట్ ధర రూ.20. ప్యాకెట్‌లో 7 పూరీలు (175 గ్రాములు), పొటాటో వెజిటబుల్ (150 గ్రాములు), ఊరగాయ (12 గ్రాములు) ఉంటాయి. రైల్వే ప్లాట్‌ఫారంపై ఉన్న జన్ ఆహార్ ఔట్‌లెట్స్‌లో మాత్రమే దొరుకుతాయి. రూ. 50 ఫుడ్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. ఇందులో స్నాక్స్/కాంబో మీల్స్ ఉంటాయి.

indiatrains1

తక్కువ ధరకే మంచినీళ్ల సీసా లభించనుంది. రూ. 3కే వాటర్ బాటిల్ ఇస్తారు. ఇది 200 ఎంఎల్ ఉంటుంది. ఉదయపూర్, అజ్మీర్, అబురోర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలన్నీ అందుబాటులో ఉన్నాయి. నార్త్ వెస్ట్రన్ రైల్వేస్ పరిధిలోని అన్ని స్టేషన్లలో త్వరలోనే జనతాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో అమలు చేస్తారు. లాంగ్ జర్నీ చేసేవారికి ఈ తరహా తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం దొరకడం అనేది బాగా ఉపయోగపడుతుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+