Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి కోసం బస్సులు పంపిన హీరో రజనీకాంత్, వస్తున్న విఐపీలు వీరే...

చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన భారీ ఎత్తున జరగనుంది. ఇందుకోసం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు బస్సులను పంపించారు. వివిఐపిల కోసం రజనీకాంత్ ఈ బస్సులను పంపించారు. గతంలో రజనీకాంత్ తాను నటించిన శివాజీ సినిమాను హైదరాబాదులో చంద్రబాబుకు చూపించారు.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు జయలలిత అభిలషించారు.

ఈ మేరకు ఆమె చంద్రబాబుకు లేఖ రాశారు. శంకుస్థాపన ఏ ఆటంకాలూ లేకుండా పూర్తి కావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేంతటి ప్రాధాన్యతను సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. కొత్త రాజధానికి బాబు చేస్తున్న కృషి ఫలితాలను అందించాలని ఆశించారు. అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.

 Jayalalithaa greets people of AP on foundation, Rajinikanth send buses

వస్తున్న వివిఐపీలు వీరే...

అమరావతి శంకుస్థాపనకు వస్తున్నట్టు ఆహ్వానాలు అందుకున్న 121 మంది నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది. వీరిలో పలువురు గవర్నర్‌లు, విదేశీ అంబాసిడర్లు, సుప్రీం కోర్టు జడ్జీలు, పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు, ప్రముఖులు ఉన్నారు.

చంద్రబాబు మిత్రుడు, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, అస్సాం, నాగాలాండ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ పీబీ ఆచార్య, వెనిజులా అంబాసిడర్‌ ఆగస్టో మాంటియిల్‌ దంపతులు, సుప్రీం కోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, బెల్జియం, బల్గేరియా అంబాసిడర్‌లు అమరావతికి వస్తున్నట్టు సమాచారమిచ్చారు.

బంగ్లాదేశ్‌, బ్రిటన్, రువాండా హైకమిషనర్లు, కెనడా ట్రేడ్ కమిషనర్, జపాన్ ప్రతినిధిగా చీఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఆర్గనైజేషన్‌ హాజరు కానున్నారు. కోనేరు హంపి, వీవీఎస్ లక్ష్మణ్, తోషిబా ఇండియా ఎండీ కెంజీ యురేయ్‌, వీ2 ఎక్స్‌ పో సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజా గంజుపల్లి, దాల్మియా సిమెంట్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ గోనె పునీత్‌ దాల్మియా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ప్రతినిధి మసాయు కికుబో, వాల్‌ మార్ట్‌ ఇండియా ఉపాధ్యక్షుడు రజనీష్‌ కుమార్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్ జీఎం రావులు రానున్నారు.

లాస్‌ ఏంజెల్స్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ భాస్కర్‌, సుమాటో కార్పొరేషన్‌ ప్రతినిధి హిరోయో తదితరులతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. వీరందరికీ మరువలేని ఆతిథ్యం ఇవ్వాలని, ఏ లోటూ రాకుండా చూసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అమరావతి శంకుస్థాపనకు వస్తున్న వారిలో.... అపోలో ప్రతాప్ రెడ్డి, ఏషియన్ పేయింట్స్ ప్రతినిధి, ఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉఫాధ్యక్షులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+