ఒడిశా ఎన్ కౌంటర్ : గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరాంరెడ్డి వ్యూహం ఫలించింది

విశాఖపట్టణం : ఒడిశా ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలను లక్షంగా చేసుకొని సాగింది.ఈ ఆపరేషన్ ఫలించింది. కీలకమైన ఇద్దరు నాయకులతో సహా24 మంది మావోలు ఈ ఎన్ కౌంటర్ లో మరనించారు.ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ తృటిలో తప్పించుకొన్నారు.ఈ కీలకమైన ఆపరేషన్ వెనుక గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరాంరెడ్డి కీలకంగా వ్యవహారించారు..జయరాంరెడ్డి పక్కా ప్లాన్ తో పోలీసులు ఈ ఎన్ కౌంటర్ లో పై చేయి సాధించారు.

ఏఓబిలో మావోయిస్టులు సమావేశమౌతున్నారనే సమాచారాన్ని అందుకొన్న గ్రేహౌండ్స్ పోలీసులు పక్కా ప్లాన్ వేశారు.మావోలు సమావేశమయ్యే ప్రాంతాన్ని తెలుసుకొని...అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు దాడికి ముందే సిద్దమయ్యారు.గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరాంరెడ్డి వ్యూహాం విజయవంతమైంది. ఆయన వేసిన ప్లాన్ ప్రకరాంగానే పోలీసు దళాలు మావోలను మట్టుబెట్టాయి.

jayaramreddy commondent of greyhounds

మావోలు సమావేశమైన సమయంలో మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకొంటారు.అయితే ఏఓబిలో మావోలు సమావేశమైన ప్రాంతం లోయలో ఉంది.దీంతో మూడంచెల భద్రత వ్యవస్థను చేదించే పనిలేకుండానే ఎత్తైన ప్రాంతం నుండి పోలీసులు దాడికి పాల్పడ్డారు.గ్రేహౌండ్స్ కమాండెంట్ వ్యూహం ఫలించింది.మావోయిస్టులకు పోలీసులతో తలపడే వ్యవధి లేకుండా దెబ్బతీశారు.

రెండు రోజుల ముందు నుండే ఈ పథకానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి నుండి గ్రేహౌండ్స్ పోలీసులు తమ ప్లాన్ ను అమలు చేశారు.ఆదివారం సాయంత్రానికి మావోల శిబిరానికి పది కిలోమీటర్ల దూరానికి చేరుకొన్నాయి.విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపూట్ వద్ద వాహానాలతో పాటు సెల్ పోన్లను పూర్తిగా బంద్ చేశారు. ఎటువంటి సిగ్నల్స్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేసుకొన్నారు. మావోల శిబిరం సమీపానికి చేరుకొన్నారు.సోమవారం తెల్లవారుఝాము వరకు మావోలకు సమీపంలోని కొండ వద్దకు చేరుకొన్నారు. ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు.రెండు శిబిరాల్లో 40 మంది మావోలు ఉన్నారు.అయితే పోలీసులు ఒకే శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 24 మంది మావోలు మరణించారు.ఆర్ కె తనయుడు మున్నా మరణించాడు. ఆర్ కె తప్పించుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+