నటి కవిత ఆసంతృప్తి: రోజాకు కౌంటర్‌గా జయసుధ?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు కౌంటర్‌గానే జయసుధను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ నటి కవిత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయితే, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల "మా'' ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ మద్దతు తెలిపిన ప్యానెల్ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్ది సినీనటుడు రాజేంద్రప్రసాద్‌పై ఓటమిపాలైయ్యారు. అప్పటినుండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు కూడా జయసుధను తీసుకొచ్చి పార్టీలో మహిళా సినీ గ్లామర్ పెంచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఫైర్‌బ్రాండ్గ నగరి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశంలో చరుకైన నాయకురాలిగా పనిచేశారు.
మరో తెలుగు సినీ నటి కవిత టిడిపిలో ఉన్నా ఆశించిన స్దాయిలో పార్టీలో ఇమడలేక పోయారు. జయప్రద కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేశారు. తరువాత ఎంపిగా డిల్లీ స్దాయిలో వెళ్లారు. తరువాత మారిన రాజకీయ సమీకరణాలలో జయప్రద తెలుగుదేశం పార్టీకి దూరమై సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

కాగా, రోజా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెసులో చేరాలని అనుకున్నారు. కానీ ఆయన మృతి తర్వాత సంభవించిన పరిణామాల నేపత్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆమెకు ధీటుగా టిడిపి శాసనసభ్యురాలు కవిత, మంత్రి పీతల సుజాత విరుచుకుపడడానికి ప్రయత్నించారు.
రోజాను డీకొనటానికి టిడిపిలో గ్లామర్ గల తారలు లేరనే ఉద్దేశంతో చంద్రబాబు జయసుధను పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన నేతగా ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజాపై జయసుధను అ్రస్తంగా తయారు చేయటానికి చ ద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో తెలంగాణలోని సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి జయసుధ పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. తన బంధువర్గం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందని టిడిపిలో చేరిన తర్వాత జయసుధ అన్నారు. దీన్నిబట్టి జయసుధ కూడా ఎపి రాజకీయాల్లో ఉండాలనే అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications