పొన్నాలను సిఎంగా చేద్దాం: వైశాలి, జయసుధ వంత

హైదరాబాద్/వరంగల్: గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి, నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చిన టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను భారీ మెజారిటీతో గెలిపించి, ముఖ్యమంత్రిగా చేసుకుందామని పొన్నాల కోడలు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి శుక్రవారం అన్నారు. పొన్నాల గెలుపు కోసం ఆమె జనగామ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొన్నాల అహర్నిశలు కృషి చేశారన్నారు.

వైయస్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయాలని సోనియాగాంధీని కోరిన 41మంది ఎమ్మెల్యేలలో తొలి సంతకం పొన్నాలే అన్నారు. పొన్నాల అందించిన సేవలను గుర్తించిన సోనియా గాంధీ పొన్నాలను టిపిసిసి అధ్యక్షుడిగా నియమించారని, ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తద్వారా ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Jayasudha and Vaishali says Ponnala will become CM

భగీరథ ప్రయత్నంతో గోదావరి జలాలను నియోజకవర్గానికి రప్పించిన ఘనత పొన్నాలకే దక్కుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వ్యవసాయానికి సాగునీటినందించి భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంపొందింపచేసేందుకు తపాస్‌పల్లి, చీటకోడూరు, బొమ్మకూరు, గండిరామారం రిజర్వాయర్‌లలోకి గోదావరి నీటిని రప్పించారన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెసు పార్టీదే అన్నారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని, మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి అవుతారని సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ వేరుగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+