జయేంద్ర సరస్వతికి అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్‌కు తరలించారు. నెల్లూరులోని మూలాపేటలోని కంచికామకోటి ఆశ్రమంలో కామాక్షి సమేత చంద్రవౌళిశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ దంపత సమేత విగ్రహ ప్రతిష్ఠల కోసం ఆయన నెల్లూరు వచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం జయేంద్ర సరస్వతి నగరంలోని పలు కార్యక్రమంలో పాల్గొని జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో షుగర్ లెవల్, బిపి తగ్గి పోయి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటహుటిన హాస్పిటల్‌కు చేర్చారు.

అత్యవసర చికిత్స చేశారు. వెంటిలేటర్ అమర్చారు. అయితే ప్రాణాపాయంలేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు వేల సంఖ్యలో ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. స్వామీజి ఆరోగ్యం కోసం వారు భగవంతుడ్ని వేడుకోవడం కనిపించింది.
నెల్లూరు నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరుకావడంతో తీవ్ర అలసట వల్ల అస్వస్థతకు గురయ్యారని, దానికి తోడు జయేంద్ర సరస్వతి (82) సంవత్సరాల పైన ఉండటంతో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications