తాడిపత్రిలో తేడా వస్తే తాట తీస్తాము, జైల్లో ఉన్న వాళ్లకు న్యాయం చేస్తాం, జేసీ ఫ్యామిలీ హామి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పలు జిల్లాలో వైసీపీ నాయకులు సైలెంట్ అయిపోయారు. అయితే రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మాత్రం రాజకీయాలు ఇంకా వాడివేడిగా ఉన్నాయి. తాడిపత్రిలో టీడీపీ నాయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
నెల రోజుల క్రితం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారినా తాడిపత్రిలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఇలాంటి సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడొద్దని, అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను బయటకు పిలుచుకుని వచ్చే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి మన మీద కక్ష పెంచుకుని టీడీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని, జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలతో పాటు వారి కుటుంబాలను మేము ఆదుకుంటామని, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి ఆదిశగా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో, తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కష్టపడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించారని, అయితే గెలిసిచ ఆనందం కంటే టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే బాధ తనకు ఎక్కువగా ఉందని జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాను తాడిపత్రి ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎవరికి అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇక ముందు తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే జేసీ కుటుంబం తాట తీస్తుందని, అంతవరకు తెచ్చుకోకూడదని వైసీపీ కార్యకర్తను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రిలో జేసీ కుటుంబం మరోసారి గెలవడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.












Click it and Unblock the Notifications