పవన్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండకపోవచ్చు..టీడీపీ నేత సంచలన కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత చట్ట సభల్లో అడుగుపెట్టబోతున్నారాయన. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ కల్యాణ్ , ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ సహాకారంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు డిప్యూటి సీఎం పదవి కూడా దక్కడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉంటే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదని..ఆయన్ను నేను ఎప్పుడు కలవలేదని ఆయన వ్యాఖ్యనించారు. పవన్ ఇప్పుడే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారని ..మరో నెల తర్వాత ఆయన పరిపాలన, విధానాలపైన కామెంట్స్ చేయవచ్చని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే నాకు తెలిసినంత వరకు పవన్ ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనాసాగలేరని జేసీ చెప్పుకొచ్చారు.

ఆయనకు రాజకీయాలకు కన్నా సినిమాలే బెటరని.. పవన్ ఆర్ధికంగా బలంగా ఉండలంటే సినిమాలే కరెక్ట్ అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే అని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జేసీ ట్రావెల్స్ సైతం మూతపడిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేసీ దివాకర్ రెడ్డి ..ఇటీవల జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తమ్ముడు కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం జీసీ దివాకర్ రెడ్డి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications