వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లీ! మాకు తీవ్ర అన్యాయం చేశావు: పార్లమెంటులో సోనియాతో జేసీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీవ్ర అన్యాయం చేశావు.. తల్లీ అంటూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ కోసం జేసీ ఢిల్లీలో ఉన్నారు.

పార్లమెంటు ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డికి సోనియా గాంధీ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఆయన ఆమెకు నమస్కరించి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లీ.. రాష్ట్రాన్ని విభజించి రెడ్లకు తీరని అన్యాయం చేశావు, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రెడ్లు నిలువునా మునిగారు అని వ్యాఖ్యానించారట. దానికి సోనియా ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లారట.

కాగా, అంతకుముందు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోకసభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం ప్రారంభించి, సుదీర్ఘంగా మాట్లాడారు. టీడీపీకి 13 నిమిషాలు కేటాయించారు. కానీ ఆయన దాదాపు గంటపాటు మాట్లాడారు. గల్లా మాట్లాడుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అడ్డు తగిలారు. మీకు ఎంత సమయం కేటాయించానని ప్రశ్నించారు.

మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీమోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీ

JC Diwakar Reddy comments on Sonia Gandhi!

తనకు మరింత సమయం కావాలని గల్లా సమాధానమివ్వగా, కుదరదని స్పీకర్ చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో ముగించాలన్నారు. గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు గంట కంటే ఎవరూ తక్కువగా చర్చ జరపలేదన్నారు.

గల్లా ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్

గల్లా జయదేవ్ ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గల్లా సమగ్రంగా చూపించారని, అయిదు కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకే తాము పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా కింద 2014లో ప్రధాని మోడీ ఏ హామీలు ఇచ్చారో, వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

English summary
It is said that Telugudesam Party MP JC Diwakar Reddy takes on UPA chairperson Sonia Gandhi for Andhra Pradesh division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X