అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన మంత్రదండం వల్లే: వైఎస్ జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అయితే, తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరు సూపర్ర్! పగలు, ప్రతీకారాలు కాదు 'జగన్ గారూ' అంటూ శ్రీరెడ్డి సంచలనం, కీలక సూచనలుచిరు సూపర్ర్! పగలు, ప్రతీకారాలు కాదు 'జగన్ గారూ' అంటూ శ్రీరెడ్డి సంచలనం, కీలక సూచనలు

జగన్‌కు మంచి చెడు తెలియదు..

జగన్‌కు మంచి చెడు తెలియదు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలలు గడవాలని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి పాలన అనుభవం లేదని, మంచి చెడు చెప్పేవారు కూడా లేరని అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మంచి చెడూ రెండు చేస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు.

మోడీ మంత్రదండం వల్లే..

మోడీ మంత్రదండం వల్లే..

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రదండం కారణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటూ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాలన తీరుపై జేసీ పెద్దగా స్పందించలేదు.

చర్చనీయాంశంగా జేసీ వ్యాఖ్యలు

చర్చనీయాంశంగా జేసీ వ్యాఖ్యలు

తాజాగా, జేసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో కొన్నిసార్లు విమర్శించిన జేసీ దివాకర్ రెడ్డి.. మరికొన్ని సార్లు ప్రశంసలు కూడా చేయడం గమనార్హం. మోడీ కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చారని జేసీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జేసీ వ్యాఖ్యలపై జగన్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

రూ. 6లక్షలు పోగొట్టుకుని..

రూ. 6లక్షలు పోగొట్టుకుని..

ఇది ఇలావుంటే, జేసీ దివాకర్ రెడ్డికి చెందిన సూట్ కేసులో రూ. 6లక్షల మాయం కావడం ఇటీవల కలకలం రేపింది. అక్టోబర్ 11న విజయవాడకు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి.. గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో గది తీసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పనిమీద సచివాలయానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.30గంటలకు హోటల్‌కు చేరుకున్నారు. కారులో ఉన్న తన సూట్ కేసును గదిలో పెట్టమని కారు డ్రైవర్ గౌతమ్‌కు చెప్పారు. డ్రైవర్ ఆ సూట్ కేసును గదిలో పెట్టాడు. ఆ రోజు సాయంత్రం 6గంటల సమయంలో సూట్ కేసులో చూసుకోగా.. రూ. 6లక్షలు మాయమైనట్లు గుర్తించారు జేసీ.

 కారు డ్రైవరే కాజేశాడు..

కారు డ్రైవరే కాజేశాడు..

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సదరు డ్రైవర్ గౌతమ్‌ను విచారించారు. దీంతో తానే ఆ డబ్బును తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు. తన డ్రైవరే ఇలా దొంగతనం చేయడంతో జేసీ దివాకర్ రెడ్డి కొంత అసహనానికి గురయ్యారు.

English summary
TDP former MP JC Diwakar Reddy comments on YS Jaganmohan Reddy's victory in 2019 assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X