జగన్, టిడిపిలో చేరలేం: బిజెపిలో చేరడం మేలన్న జెసి!

దెబ్బకు దెబ్బ తీయాలంటే బిజెపిలో చేరడమే ఉత్తమమన్నారు. తనలాంటి వారు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వంటి పార్టీలలో చేరలేరన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనేది జరిగిపోయిన నిర్ణయమని, ఇంట్లో శవాన్ని పెట్టుకొని, కుళ్లు కంపు కొడుతున్నా దానికి ప్రాణం వస్తుందనే ఆశతో ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారయిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో శవాన్ని భూస్థాపితం చేయడం మినహా మరేం చేయలేమన్నారు.
జగన్ నాయకుడు కాదు గజదొంగ: కడియం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదని గజదొంగ అని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో అన్నారు.
తెలంగాణ భూములు అమ్మింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని జగన్ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేశాడని ఆరోపించారు. మన భూ ములను కబ్జా పెట్టి కోట్లు కొల్లగొట్టాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications