క్షణం కూడా ఉండడం వేస్ట్, గుడారాల్లో ఉందాం: టిపై జెసి

ఈ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అంశం చర్చకు వచ్చింది. దీనిపై జెసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిలో గుడారాలు వేసుకుని పని చేస్తామంటే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. గుడారాల్లో పని చేస్తూనే రాజధాని నిర్మాణాన్ని కొనసాగించవచ్చని, ఇందుకు మహా అయితే ఐదేళ్లకు మించి సమయం అవసరం ఉండదన్నారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించడం సరికాదని గాదె వెంకట రెడ్డి అన్నారు. ఈ సమయంలో గాదె, యాదవ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి పదవిని ఆశించేవాడు గాడిద అవుతాడని వేదవ్యాస్ అనగా, జెసి స్పందిస్తూ.. రాజకీయ భవిష్యత్తు అవసరం లేదనుకునేవాళ్లు రాజకీయంగా గాడిద కావొచ్చునని కానీ, సిఎంగా మూడు నెలలపాటు కొనసాగి వెనకేసుకుందామనుకునే వారికి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉండదన్నారు.












Click it and Unblock the Notifications