పరువుకు భంగం: సోషల్ మీడియాలో జేసీ, పల్లె ఫోన్ సంభాషణ, ముగ్గురిపై కేసు నమోదు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి పాల్పడిన కొండసాని సురేష్‌రెడ్డి, మరో ముగ్గురిపై కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేశారు.

పరువు ప్రతిష్టకు భంగం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే, ఎంపీల ఫోన్ సంభాషన్ రికార్డుపై టీడీపీ మండల కన్వీనర్ దామోదర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొండసాని సురేష్‌రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ.. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యే పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.

రెచ్చగొట్టేలా..
బహిరంగ ప్రచారంలో పాల్గొంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో విబేధాలు సృష్టించి రాజకీయ లబ్దిపొందాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలతో అందరిని రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు.

అక్రమ ఆస్తులు..
కాగా, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమ సంపాదనతో ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టుకున్నారని దామోదర్ నాయుడు తన ఫిర్యాదులో ఆరోపించారు.

సురేష్ రెడ్డిపై కేసు
దామోదర్ ఫిర్యాదు మేరకు వ్యక్తిగత సంభాషణల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి, ప్రచారం చేసిన కారణంగా సురేష్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications