మేం చచ్చిపోతాం: జగన్‌పై జెసి దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మేమంతా చచ్చిపోతామని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

హోదాపై పోరులో వెనక్కి: చిక్కుల్లో జగన్, అసలేం జరిగింది?

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో ఏరువాక కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు.

దూసుకెళ్తున్నారు

దూసుకెళ్తున్నారు

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో సమస్యలను అధిగమిస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోను చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

మనిషి అన్న తర్వాత లోటుపాట్లు

మనిషి అన్న తర్వాత లోటుపాట్లు

మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒకచోట లోటుపాట్లు ఉంటాయని, అసలు ఎవరిలో తప్పులు ఒప్పులు ఉండవని ప్రశ్నించారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చిన్నచిన్న పొరపాట్లు చేసిందని అభిప్రాయపడ్డారని చెప్పవచ్చు.

పైసా నిధుల్లేకపోయినా..

పైసా నిధుల్లేకపోయినా..

జెసి ఇంకా మాట్లాడుతూ.. 2019లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని జెసి చెప్పారు. ఆయన కార్యదీక్ష, పట్టుదలను చూసి ప్రజలు మళ్లీ గెలిపించాలన్నారు.

పైసా నిధులు లేకపోయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా పనులు ఆగడం లేదన్నారు. ఎన్టీఆర్ కలని చంద్రబాబు సాకారం చేస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి ప్రశంసించారు. ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి నాలుగు కాలల పాటు జనం మందిలో నిలిచిపోవాలన్నారు.

ఎన్టీఆర్ కలను సాకారం చేసేది చంద్రబాబే..

ఎన్టీఆర్ కలను సాకారం చేసేది చంద్రబాబే..

ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పట్టుదలతో చేపడుతున్నారని జెసి కితాబిచ్చారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తప్ప మనకు భవిష్యత్తు లేదన్నారు. ఎన్టీఆర్ కలలను సాకారం చేసేది చంద్రబాబే అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapur MP JC Diwakar Reddy on Friday said that they will die if YSR Congress Party chief YS Jagan will become CM.
Please Wait while comments are loading...