JC Prabhakar Reddy: తీవ్ర అస్వస్థతకు గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి..
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతోపాటు టీయర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో పోలింగ్ తర్వాతి రోజు కూడా ఉద్రిక్తలు నెలకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గ్యాస్ ఎఫెక్ట్ తో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు గుర్తించి... వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని కాంచన హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ సహాయంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి చేయడం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో బయలుదేరారు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. అయినప్పటికీ జేసీ ముందుకు సాగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడైన కిరణ్ కుమార్ కు గాయలయ్యాయి. ప్రస్తుతం తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications