జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్‌కు తేదీ దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫైట్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటిగా తాడిపత్రి నిలిచింది. తాడిపత్రిలో వార్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డిగా మారింది. వాస్తవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అశ్మిత్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ.. తండ్రి చాలా ఫోకస్డ్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా తొలిసభను తాడిపత్రిలోనే జగన్ నిర్వహించడంతో పెద్దారెడ్డి వర్గం, వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా తాడిపత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రికి అంతా నష్టమే చేశాడని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాడిపత్రిని గోమూత్రంతో శుద్ధి చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

పెద్దారెడ్డి గురించి మాట్లాడటం కూడా అనవసరమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని ..ప్రజలు ఎవరూ కూడా ప్రశాంతంగా లేరని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించారు కానీ అందులో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారని పెద్దారెడ్డిని ఆయన ఎద్దెవా చేశారు. తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే చిరు వ్యాపారులపై ఫ్యాక్షనిజం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రిలో మూడు రోజుల పాటు ఆంక్షలు విధించారని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications