ఊర్కునేది లేదు: కోడి పందేలపై జెసిప్రభాకర్ రెడ్డి పంతం
అనంతపురం : సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిరుడు నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున కోడిపందేలతో పాటు పందుల పోటీలు, జంతువుల అందాల పోటీలను నిర్వహిస్తామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
తాడి పత్రిలోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పందాలు ఎక్కడ నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. కోడి పందేలపై నిషేధం ఉందన్న విషయమై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో లేని నిషేధం ఇక్కడ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.

అన్నిచోట్లా నిషేధిస్తే అందుకు అంగీకరిస్తామని, అలాకాకుండా అడ్డుకొనే ప్రయ త్నం చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రజలు అభిమానించేవారే నాయకులుగా చలామణి అవుతారని, వారస్వత రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో పది మంది వెంట ఉంటే గొప్ప నాయకులుగా కొందరు గొప్పలు చెప్పుకొంటున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా పుట్టుకొస్తున్న నాయకుల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, వారివల్ల సమస్యలేనని అన్నారు.












Click it and Unblock the Notifications