పెద్దారెడ్డితో మాకు ప్రాణహాని ఉంది, అనంతపురం నుంచి బహిష్కరించాలి, జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారంలో ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఇంకా మరిచిపోలేదని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాడిపత్రి మునిసిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంతకైనా తెగిస్తాడని, తనకు రక్షణ కల్పించాలన చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ సందర్బంలో జేసీ ప్రభాకర్ రెడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు.

JC Prabhakar Reddy who accused Kethi Reddy Peddareddy of threatening our lives

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబం మీద పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని, ఆ తరువాత తాడిపత్రి నియోజక వర్గంలో జరిగిన ప్రతి సమావేశంలో తమ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా తాను మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను వదలను అని, ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి మా కుటుంబానికి బహిరంగంగా వార్నింగ్ లు ఇచ్చాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హాయంలో మమ్మల్ని బెదిరించడమే కాకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలిపెట్టను అని చెప్పిన కేతిరెడ్డి పెద్దారెడ్డితో తనకు, తాడిపత్రి ప్రజలకు ప్రాణహాని ఉందని, కేతిరెడ్డి మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంతకైనా తెగించే వ్యక్తి అని అందరికీ తెలుసు అని టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల వైసీపీ నాయకులు పెద్దవడుగూరులోని టీడీపీ కార్యకర్తలకు చెందిన మామిడి చెట్లను నరికేసి మీ అంతు చూస్తామని బెదిరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

తాడిపత్రి ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులుసాయి ప్రతాప్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డిలను జిల్లా నుంచి బహిష్కరించాలని చంద్రబాబు ప్రభుత్వానికి తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మనవి చేశారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో మా బస్సుల మీద (దివాకర్ ట్రావెల్స్) తప్పుడు కేసులు పెట్టిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని లేదంటే అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+