పిలుపునిచ్చిన జేడీ లక్ష్మీనారాయణ- బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో..!!

రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కీలక సూచన చేశారు.

అమరావతి: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ షెడ్యూల్ అయింది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ పోటీలో ఉన్నారు.

పోటీ తీవ్రం..

పోటీ తీవ్రం..

టీడీపీ, బీజేపీ నుంచి వేపాడ చిరంజీవీరావు, పీవీఎన్‌ మాధవ్‌ బరిలో నిలిచారు. టీచర్స్ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థిగా టీచర్స్ డీకే రమాప్రభ పోటీలో ఉన్నారు. తూర్పు రాయలసీమలో వైసీపీ నుంచి పీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి కే శ్రీకాంత్‌ చౌదరి, బీజేపీ అభ్యర్థిగా ఎస్‌ దయాకర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు.

స్థానికంలో..

స్థానికంలో..

పశ్చిమ రాయలసీమలో వైసీపీ నుంచి వెన్నపూస రవి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా నగురూరు రాఘవేంద్ర తలపడుతున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తోన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిదుమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీచర్స్ స్థానాల్లో..

టీచర్స్ స్థానాల్లో..

కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన స్థానాల్లో కూడా విజయం సాధిస్తామనే ధీమా వైఎస్ఆర్సీపీ నేతల్లో వ్యక్తమౌతోంది. పీడీఎఫ్‌ అభ్యర్థులు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు బరిలో నిలిచారు.

 మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన..

మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన..

పోలింగ్ నేపథ్యంలో- సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయాలని పిలపునిచ్చారు.

అంబేద్కర్ సూక్తి..

అంబేద్కర్ సూక్తి..

పార్టీలకు ప్రాతినిథ్యాన్ని వహించేవారి కంటే కూడా శాసన మండలిలో ప్రజల గళాన్ని బలంగా వినిపించే ప్రజాప్రతినిధులను ఎన్నుకుందామని సూచించారు. పోరాడి రాజులు అవుతారో.. అమ్ముకుని బానిసలుగా మారుతారో.. నిర్ణయం ఓటర్ల చేతుల్లోనే ఉంది.. అంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సూక్తిని జేడీ లక్ష్మీనారాయణ ఉటంకించారు.

వైసీపీ కోసం..

వైసీపీ కోసం..


ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ ఇప్పటికే అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి వైసీీపీ ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చంద్రబాబు చిన్నచూపు చూశారని, చట్టసభల్లో వారికి ఏ మాత్రం అవకాశాన్ని కల్పించలేదని అన్నారు. అటు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+