వేషాలతో బంగారం మోసాలు: ఐదుగురి అరెస్టు
విజయవాడ: సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించి ప్రమాదకరమైన పరిస్థితులు దాపురిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇతర వృత్తులవారు నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల పోలీసులు ఛేదించిన దోపిడీ, మోసం కేసులను చూస్తే ఈ విషయం తెలిసి వస్తుదంి.
సోమవారంనాడు పోలీసులు నిరుద్యోగి అయిన ఎంబిఎ గ్రాడ్యుయేట్ నేతృత్వంలో నడుస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. ఇతర ముఠా సభ్యులు కూడా బిఎ, బిఎస్సీ వంటి డిగ్రీలు చేసిన ఉద్యోగాలు లేనివారే కావడం గమనార్హం.

చౌకగా బంగారం ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసిన కేసులో రుద్రాపతి డేవిడ్ తుర్మన్ బాబు ప్రధాన నిందితుడు. అందుకు తన మిత్రులు కోరకు వీర వెంకట మహీంద్ర కుమార్ (25), ఎర్రంశెట్టి గోపినాథ (24), పొనుగుమతి శ్రీకాంత్ (29), నేపాలి శివకిశోర్ (29)లను కూడగట్టుకున్నాడు.
దుబాయ్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన బంగారాన్ని తక్కువ ధరలకు ఇస్తామని ఆ ముఠా ప్రజలను నమ్మించింది. ఇద్దరు వ్యక్తులు బాధితుల నుంచి డబ్బులు వసూల చేస్తారు, మరో ఇద్దరు ఖాకీ దుస్తులు ధరించి పోలీసులుగా నటిస్తూ వచ్చేస్తారు. దాంతో బాధితులతో పాటు మరో ఇద్దరు పారిపోతారు.
ఈ ముఠాకు సంబంధించిన వివరాలను ఎసిపి కె. లావణ్య లక్ష్మి వివరించారు. జి. శ్రీకాంత్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ముఠాను అరెస్టు చేశారు. శ్రీకాంత్ నుంచి ముఠా సభ్యులు 12 వేల రూపాయలు తీసుకున్నారు అతనికి బంగారం రంగు పూతతో కూడిన చాకొలెట్లను, కొన్ని రాళ్లను బాక్స్‌లో పెట్టి ఇచ్చారు. వెంటనే నకిలీ పోలీసులు ప్రవేశించారు.












Click it and Unblock the Notifications