సంధ్య మృతి, దద్దరిల్లిన ఆసుపత్రి
గుంటూరు: జూనియర్ వైద్యుల ధర్నాతో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల దద్దరిల్లింది. గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు ధర్నా చేశారు. డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పట్టుకుని, నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు డాక్టర్ లక్ష్మి అందుబాటులో ఉన్నారని, అయినా పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications