బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోటీ!... కొడాలి నాని, వంశీ పనేనా?

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది. బాలయ్య కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా ఈనెల 19వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్మాతలు పూర్తిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు.

19న అదుర్స్ రీ రిలీజ్ : ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. అయితే బాలయ్యకు, తారక్ కు మధ్య పోటీ ఎందుకొస్తోంది? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. బాలయ్య సినిమా విడుదలరోజే జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అదుర్స్ ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 19వ తేదీనే అదుర్స్ ను విడుదల చేస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాతలుకానీ, దర్శకుడు కానీ ఎక్కడా ప్రకటించలేదు. నందమూరి అభిమానులు కూడా ఒకేరోజు బాబాయ్ అబ్బాయ్ సినిమాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.

junior ntr adhurs re release on october 19th 2023

కొడాలి, వంశీ నిర్మాతలు : అదుర్స్ సినిమాకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలు. ప్రస్తుతం వీళ్లిద్దరు రాజకీయంగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉన్నారు. వంశీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో కొడాలి నాని, వంశీల వైరం బహిరంగ రహస్యమే. అయితే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారంటున్నారుకానీ అటువంటిదేమీ ఉండదని కొందరు అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే తారక్ జోక్యం చేసుకొని రెండింటి మధ్య పోటీ లేకుండా చూడాలని, అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+