జూనియర్ ఎన్టీఆర్ మౌనమే సమాధానమా??
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామారావు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పాల్గొనలేదు. దీనికి సంబంధించి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎవరికి వారుగా తమకు అనుకూలమైన కథనాలను బయటకు పంపిస్తున్నారు. అసలేం జరిగింది? ఎందుకు హాజరు కాలేదు? అనేది వారి కుటుంబ సభ్యులకే తెలియాలికానీ ఇతరులెవరికీ తెలిసే అవకాశం లేదు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని కొడుకు వివాహానికి బాలకృష్ణ, మోక్షజ్ఞ, తారక్ తో సహా అందరూ హాజరయ్యారు. అయితే దానికన్నా కాయిన్ ఈవెంటే హైలైటవుతోందనే విషయాన్ని గమనించాలి. ఏం జరుగుతోంది? ఏయే వార్తలు ప్రచారం ఉన్నాయి? అనే విషయాలు తారక్ దృష్టికి రాకుండా ఉండవు కదా.

ప్రస్తుతానికి జూనియర్ స్పందించకుండా మౌనంగా ఉన్నారు. అలా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇప్పుడు వివరణ ఇచ్చినా దీన్ని చిలవలు పలవలుగా చేయడానికి ఎందరో కొందరు సిద్ధంగానే ఉంటారు. దేవర షూటింగ్ ఉంది అని చెబితే.. కొరటాల శివ బన్నీ ఇంటికి వెళ్లి అభినందించాడు కదా అంటారు. ఇటీవలే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని ఖండిస్తూ జూనియర్ ఒక వీడియో విడుదల చేశాడు.
సున్నితమైన ఇటువంటి విషయాలపట్ల మౌనంగా ఉండటమే మంచిది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రత్యర్థులకు సంబంధించిన ఏ అంశాన్నైనా రాజకీయంగా వాడుకునేందుకు కొన్ని శక్తులు పొంచివుంటాయి. దేవర సినిమాతో జాతీయంగా, అంతర్జాతీయంగా తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉండటమే సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మౌనాన్ని మించి గొప్ప పరిష్కారం లేదు.












Click it and Unblock the Notifications