టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేశా..సీఎం ఓ మిస్సైల్: జగన్ ఆలింగనంతో వైసీపీలోకి జూపూడి..!
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీ గూటికి చేరారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన కలిసి నడిచిన జూపూడి తరువాతి కాలంలో టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఆలింగనం చేసుకొని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా జనసేనకు రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు.
తాను టీడీపీ లోకి వెళ్లి పొరపాటు చేసానని జూపూడి చెప్పుకొచ్చారు. ముఖ్యమంతరి ఒక మిస్సైల్ లా దూసుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తాను పొరపాటు చేసానని..ఇప్పుడు సరిదిద్దుకున్నాని వ్యాఖ్యానించారు. ఇటువంటి పొరపాట్లు జరగకుండా సరి దిద్దుకుంటానన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పదవుల రిజర్వేషన్ విధానం దేశం మొత్తంగా ఆదర్శంగా మారిందన్నారు. అయితే..జూపడి తిరిగి పార్టీలోకి తీసుకురావటంతో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు.

పొరపాటు చేశా..సరిదిద్దుకుంటాను..
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాను జగన్ తొలుత పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో వైయస్సార్ తనయుడికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయనతో కలిసి పని చేసానని..అయితే ఆ తరువాత టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేసానన్నారు. పొరపాట్లు తన వైపు ఉన్నాయని తాను సరిదిద్దు కుంటానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తన్న పధకాలు దేశంలోనే ఆదర్శంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను మిస్సైల్ తో పోల్చిన జూపూడి..రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని ఉక్కు మనిషిగా పేర్కొన్నారు. పార్టీ వదిలి వెళ్లినా..తిరిగి వచ్చిన తనను ఇంత ఆదరణతో చూడటం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు.

వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ
అయితే, 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జూపూడి ఓడిపోయారు. అయితే, వైసీపీలోకి ఒక ముఖ్య నేత కారణంగానే తాను ఓడానంటూ ఆరోపణలు చేసారు. ఇక, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంలో అందులో చేరారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు తరువాతి రోజుల్లో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు. ఎమ్మెల్సీగా అవకాశం కంటిన్యూ చేయలేదు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిన సమయం నుండి పార్టీకి దూరంగా ఉంటున్న జూపూడి..విజయ సాయిరెడ్డితో సంప్రదింపుల తరువాత వైసీపీలో తిరిగి జాయిన్ అయ్యారు.

ఆకుల సత్యనారాయణకు పార్టీ బాధ్యతలు..
2014 2014 ఎన్నికల్లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకుల సత్యనారాయణ 2019 ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి సైతం జనసేనలో చేరారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసారు. తిరిగి బీజేపీలోకి వెళ్లాలని భావించినా..ఆయన తన సతీమణితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆకుల సత్యనారాయణ తన సతీమణితో
ముఖ్యమంత్రితో సన్నిహిత సంబందాలు ఉన్న ఆకుల సత్యనారాయణ తన సతీమణితో పాటుగా అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ఎన్నికల మేనిఫెస్టెను అక్షరం పొల్లు పోకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రులను అరుదుగా చూస్తామని..అందులో జగన్ తొలి స్థానం లో ఉన్నారని ఆకుల చెప్పుకొచ్చారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. అయితే, ఆయనకు ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఆయనతో పాటుగా రాజమండ్రికి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications