ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం- సీఎం జగన్, గవర్నర్ సమక్షంలో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ హరిచందన్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Recommended Video
నేహా మాలిక్ బీచ్ అందాలు.. గోవాలో అందాల ఆరబోత

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ కొత్త ఛీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు సీఎం జగన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లాయర్లు, జడ్డీలు కూడా హాజరయ్యారు. గవర్నర్ హరిచందన్ కొత్త ఛీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో సంప్రదాయ పద్దతిలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్ ఒకరికొకరు అభివాదాలు చేసుకున్నారు.

సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అరూప్ కుమార్ గోస్వామిని తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ కొత్త ఛీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఇక్కడ ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు పంపింది. కొలీజియం నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా నోటిఫై చేసిన తర్వాత జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి కొత్త ఛీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. పాత ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నిన్న హైకోర్టులో వీడ్కోలు తీసుకున్నారు. ఆయన స్ధానంలో ఇవాళ్టి నుంచి జస్టిస్ అరూప్ బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications